Sobhita Dhulipala: బేరాలు.. లెక్కలు నా వల్ల కాదు.. ఇండస్ట్రీపై శోభితా ధూళిపాళ్ల షాకింగ్ కామెంట్స్!

Sobhita Dhulipala: బేరాలు.. లెక్కలు నా వల్ల కాదు.. ఇండస్ట్రీపై శోభితా ధూళిపాళ్ల షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత శోభితా ధూళిపాళ్ల పేరు సోషల్ మీడియాలో నిరంతరం మారుమోగుతోంది. కేవలం అక్కినేని కోడలిగానే కాకుండా, నటిగా తనదైన ముద్ర వేసుకుంది. లేటెస్ట్ గా శోభితా ఒక ఇంటర్వ్యూలో  తన సినీ ప్రయాణం , కెరీర్ ప్లానింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చాలా మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలోనే పక్కా ప్లానింగ్‌తో ఉంటారు. కానీ  నేను ఎలాంటి లెక్కలు వేసుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇంటర్ పూర్తి కాగానే ముంబై వెళ్ళిపోయాను. అక్కడ సినిమా ప్రయాణం అనుకోకుండానే మొదలైంది అని ఆమె చెప్పుకొచ్చారు.

 పరిశ్రమను బట్టి గుర్తింపు మారుతుంది!

కథ పరంగా నచ్చిన సినిమాల్లోనే నటిస్తానని చెబుతోంది శోభిత. అంతే తప్ప ఒకే ఇండస్ట్రీ లో జెండా పాతేయాలని ఏనాడు అనుకోలేదంటోంది. 'బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పు డు దక్షిణాది అమ్మాయి అనేవారు. తెలుగులో సినిమాలు చేస్తే బాంబే అమ్మాయి అంటారు. మరో పరిశ్రమకు వెళ్తే వాళ్లకు తోచింది ఇంకేదో అంటారు. నిజానికి మన గుర్తింపు మనం చేసే పనిని బట్టి ఉండాలి తప్ప, ప్రాంతాన్ని బట్టి కాదు" అని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

నచ్చిన కథే ప్రాధాన్యత

"ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి.. ఇన్ని సిరీస్‌లు చేయాలని నేను ఎప్పుడూ టార్గెట్లు పెట్టుకోలేదు అని చెప్పింది శోభితా. బేరాలు, లెక్కలు వేసుకుంటే పని చేయడం కష్టమవుతుంది. మనకు వచ్చే అవకాశాల్లో ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో ముందే తెలియదు. కాబట్టి వచ్చిన వాటిలో అత్యుత్తమమైన వాటిని ఎంచుకుంటూ ముందుకు వెళ్లడమే నా శైలి. అయితే, కెరీర్‌లో మరీ ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకోవాలి" అని తన వర్క్ పాలసీని వివరించారు.

ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే..

అడివి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' సినిమాతో టాలీవుడ్‌లో వెలుగులోకి వచ్చిన శోభితా, ఆ తర్వాత 'మేజర్' చిత్రంతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కేవలం వెండితెరపైనే కాకుండా 'మేడ్ ఇన్ హెవెన్' వంటి వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.  లేటెస్ట్ గా శోభితా నటించిన 'చీకటిలో'.. వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  ప్రస్తుతం  అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే, వైవిధ్యమైన కథలను వినే పనిలో ఉంది. గ్లామర్ పాత్రల కంటే పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలనే ఆమె ఎక్కువగా ఇష్టపడుతోంది. మున్ముందు ఈ అక్కినేని కోడలు మరిన్ని విలక్షణమైన పాత్రలతో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.