అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ లాండ్ విషయంలో బలప్రయోగం ఉండదంటూనే.. యూరోపియన్ దేశాలపై విధించిన అదనపు సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటనతో ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా కొంత తగ్గాయి. ఈ ప్రభావం ఈక్విటీ మార్కెట్లతో పాటు బులియన్ మార్కెట్లలో కూడా కనిపిస్తోంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు కొంత తగ్గాయి. ఎవరైనా ఆభరణాలు కొనాలనుకుంటున్న ప్రజలు రిటైల్ మార్కెట్లో తాజా రేట్లను గమనించటం మంచిది.
ALSO READ : ఒక్కరోజే 68 పైసలు డౌన్.. రూపాయి ఆల్ టైం లో!
జనవరి 22న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గి కొద్దిగా ఊరటను ఇస్తున్నాయి. దీంతో జనవరి 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.229 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 431గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 145గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : ఫొటో లవర్స్ కోసం.. ఒప్పో రెనో 15 ఫోన్లు
ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీ ఉన్నప్పటికీ నేడు కొంత తగ్గుదలను చూసింది. ఒక్క రోజులోనే కేజీకి రూ.5వేలు రిటైల్ మార్కెట్లో తగ్గటం చిన్న రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే గురువారం జనవరి 22, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గింది దేశీయంగా. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 40వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.340 వద్ద ఉంది.
