ప్రయాణాల్లో ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో రెనో15 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. వీటిలో ఏఐ పోర్ట్రెయిట్ కెమెరా, ప్యూర్ టోన్ టెక్నాలజీ లాంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ సిరీస్లో రెనో 15, రెనో 15 ప్రో మినీ, రెనో 15 ప్రో, రెనో 15సీ ఫోన్లు ఉన్నాయి. ధరలు రూ.35 వేల నుంచి రూ.73 వేల వరకు ఉన్నాయి. 200 ఎంపీ కెమెరా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి రెనో 15 సిరీస్ ఫోన్ల ప్రత్యేకతలు.
ఒప్పో తన రెనో 15 సిరీస్ ను భారత్ లో విడుదల చేసింది. ఒప్పో ప్రో,మినీ, 5G, C మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 200MP అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరా, AI పోర్ట్రెయిట్ కెమెరా, ప్యూర్‌టోన్ టెక్నాలజీతో కెమెరా లేటెస్ట్ కెమెరా ఫీచర్లున్నాయి. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం 3.5x టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్, AI ఎడిటింగ్ టూల్స్, సీమ్‌లెస్ జూమ్ వంటి ఫీచర్లున్నాయి.
200MP మెయిన్ కెమెరా..అద్భుతమైన హై-రిజల్యూషన్ సెన్సార్ (HP5), ఫుల్ క్లారిటీతో క్రాపింగ్ సపోర్టు ఉంటుంది.
50MP టెలిఫోటో పోర్ట్రెయిట్ లెన్స్.. మెరిసే పోర్ట్రెయిట్‌ల కోసం సహజమైన 85mm ఫోకల్ లెంగ్త్ 3.5x ఆప్టికల్ జూమ్ ను అందిస్తుంది.
50MP అల్ట్రా-వైడ్ కెమెరా..విశాలమైన ప్రకృతి దృశ్యాలు ,గ్రూప్ షాట్‌లను స్పష్టమైన కలర్ తో క్లిక్ చేస్తుంది.
ప్యూర్‌టోన్ టెక్నాలజీ..సబ్జెక్ట్ , పరిసరాలను బ్యాలెన్స్ చేస్తూ నాచురల్ టోన్‌లను అందిస్తుంది. రకరకాల స్కిన్ టోన్‌లను అందిస్తుంది.
