రిలయన్స్ డిజిటల్ రిపబ్లిక్ డే సేల్స్.. ఈ ఆఫర్లేంది సామీ !

రిలయన్స్ డిజిటల్ రిపబ్లిక్ డే సేల్స్.. ఈ ఆఫర్లేంది సామీ !

రిపబ్లిక్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా సేల్స్ మొదలయ్యాయి. భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ తో కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో లాంటి ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్స్ ప్రకటించాయి. రిలయన్స్ డిజిటల్ కూడా  రిపబ్లిక్ డే సేల్స్ లో భారీ ఆఫర్స్ తో ముందుకు వచ్చింది. సేల్స్ ఇప్పటికే మొదలవ్వటంతో ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఓ సారి చూద్దాం.

ఇప్పటికే స్టార్టయిన రిలయన్స్ డిజిటల్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 26 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్స్ లో ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా reliancedigital.in వెబ్ సైట్ లో కూడా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివిధ కొనుగోళ్లపై రూ.26 వేల  ఇన్స్టంట్ బ్యాంకు డిస్కౌంట్ తో పాటు కన్జూమర్ డూరబుల్స్ లోన్స్ పై రూ.30 వేల వరకు క్యాష్ బ్యాక్ , యూపీఐ పేమెంట్స్ పై 5 శాతం డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. 

ఐఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్:

ఈ సేల్స్ లో ఐఫోన్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఐఫోన్ 15 (128 GB) స్టాటింగ్ ధర రూ. 49 వేల 990 నుంచి ఉండగా.. EMIలు నెలకు రూ. 2,888 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక ఐఫోన్ 16 (128 GB) ధర రూ. 57 వేల 990 నుంచి ఉండగా.. నెలకు రూ. 3,388 EMIలతో కొనే అవకాశం కల్పిస్తున్నారు.  ఐఫోన్ 17 (256 GB) ధర రూ. 78 వేల 900 నుంని మొదలవుతుండగా, ఈఎంఐ నెలకు రూ. 3,454 నుంచి స్టార్టవుతుంది. ఐఫోన్ 17 ప్రో (256 GB) ధర రూ. లక్షా 30 వేల 900 నుంచి ఉండగా.. నెలకు రూ. 11 వేల 242 ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నారు. పైన పేర్కొన్న ఫోన్ల రేట్లలో బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిపి కస్టమర్లకు సుమారు రూ. 21 వేల రూపాయల వరకు ఆదా అవుతుంది. 

మ్యాక్‌బుక్ ఎయిర్ ఆఫర్:

MacBook Air M2 ధర 85 వేల 900 ఉండగా..  రూ. 64 వేల990  కే కస్టమర్లకు అందిస్తున్నారు. ఇందులో రూ. 4 వేల క్యాష్‌బ్యాక్, రూ. 6 వేల899 విలువైన ఫ్రీ Microsoft Office సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి.

టీవీ, ఆడియో డీల్స్:

తోషిబా 65-ఇంచుల QLED టీవీలు 2 సంవత్సరాల వారంటీతో రూ. 44 వేల 990 కు అందిస్తున్నారు. 5.1 ఛానల్ సౌండ్‌బార్ అప్‌గ్రేడ్ స్టాటింగ్ ప్రైస్ రూ. 14 వేల 990 నుంచి  ఉంది.  ఏదైనా టీవీని కొన్న వారికి సౌండ్‌బార్‌లపై రూ. 10 వేల డిస్కౌంట్  లభిస్తుంది.

రీకనెక్ట్ యాక్సెసరీలపై ఆఫర్స్:

కస్టమర్లు 20W ఛార్జర్, 10,000 mAh పవర్ బ్యాంక్ లేదా నెక్‌బ్యాండ్ వంటి వాటిని సెలెక్ట్ చేసుకుని  ఏవైనా రెండు రీకనెక్ట్  ప్రొడక్ట్ లను కేవలం రూ. 899 కు కొనే అవకాశం కల్పిస్తున్నారు. 

హోమ్, కిచెన్ నీడ్స్:

హోమ్ కిచెన్ నీడ్స్ పై భారీ ఆఫర్స్ ఇస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. రూ. 5 వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులన  కొనుగోళ్లపై, రూ.  7 వేల 990 వరకు విలువైన ఆఫర్స్ ఆఫర్లు అందించబడతాయి. అంతేకాకుండా ఎంచుకున్న ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని ప్రకటించారు.