సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ' వారణాసి ' షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఒక భీకరమైన ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంత బిజీగా మహేష్ బాబు తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత వేరు. షూటింగ్ కు కొంచె గ్యాప్ దొరికినా చాలు కుటుంబంతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తారు.
'ప్రేమ'పూర్వక సందేశం
మహేష్ బాబు తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత, వృత్తిపరంగా ఆయన చూపిస్తున్న నిబద్ధత చూస్తుంటే.. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు వృత్తిగత జీవితంలోనూ ఆయన ఒక "కంప్లీట్ మ్యాన్ అని చెప్పవచ్చు. లేటెస్ట్ గా తన భార్య, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ 54వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు పంచుకున్న భావోద్వేగపూరిత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రతపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుతూ ఆయన రాసిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
హ్యాపీ బర్త్ డే NSG (Namrata Shirodkar Ghattamaneni)... అన్నింటినీ ఎంతో ఓపికతో, ప్రేమతో దగ్గరుండి చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు. అంతకు మించి నేనేమీ కోరుకోలేను" అంటూ మహేష్ తన మనసులోని మాటను పంచుకున్నారు. దీనికి నమ్రత అందమైన ఫోటోను జత చేయడంతో, అభిమానులు "వదినమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
వంశీ సెట్స్ నుంచి వైవాహిక బంధం వరకు..
వీరిద్దరి ప్రేమకథ ఒక సినిమాను తలపిస్తుంది. 2000వ సంవత్సరంలో వచ్చిన 'వంశీ' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, ఐదేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి పలికినప్పటికీ, ఘట్టమనేని కుటుంబ బాధ్యతలను, మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలను (MB Cinemas, AMB Mall, Humble Co.) సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయనకు వెన్నెముకగా నిలిచారు. వీరికి కుమారుడు గౌతమ్, కుమార్తె సితారఉన్నారు. ఈ నలుగురి ఫోటోలు సోషల్ మీడియాలో నిరంతరం సందడి చేస్తూనే ఉంటాయి.
'వారణాసి'పై భారీ అంచనాలు
ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ' వారణాసి' సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళితో దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ఇదొక కలల ప్రాజెక్ట్, జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. దీని కోసం నేను ఎంత కష్టపడటానికైనా సిద్ధం. భారత దేశం గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. నా దర్శకుడు గర్వపడేలా నా నటన ఉంటుంది అని ధీమా వ్యక్తం చేశారు.
శ్రీరామనవమికి రిలీజ్..
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇది ఒక అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నారు.. పొడవాటి జుట్టు, గడ్డంతో సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9, 2027న శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 1,000 కోట్లకు పైగా బడ్జెట్‌తో కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ వండర్.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
