ఖర్మ ఫలితం అనుభవించాల్సిందే..! స్మృతి మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‎పై పోలీసులకు ఫిర్యాదు

ఖర్మ ఫలితం అనుభవించాల్సిందే..! స్మృతి మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‎పై పోలీసులకు ఫిర్యాదు

ముంబై: టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన మాజీ బాయ్ ఫ్రెండ్ పలాష్​ ముచ్చల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చీటింగ్ ఆరోపణలపై పలాష్ ముచ్చల్‎పై సాంగ్లీ పోలీసులకు బుధవారం (జనవరి 22) ఫిర్యాదు అందింది. ఒక సినిమా నిర్మాణం కోసం పలాష్ తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిల్మ్ ఫైనాన్షియర్ వైభవ్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను మానే పోలీసులకు అందజేశాడు. 

’’నజారియా అనే సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టాలని పలాష్ తనకు సూచించాడు. అతడి మాటలు నమ్మి రూ.40 లక్షలు ఇన్వెస్ట్ చేశా. కానీ ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఇదేంటని పలాష్​‎ను నిలదీస్తే తన డబ్బులు తనకు తిరిగి ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత డబ్బుల కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. చివరికి నా నెంబర్ బ్లాక్ చేశాడు“ అని మానే ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

దీంతో పలాష్ ముచ్చల్‎పై సాంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశా.. ఇందుకు సంబంధించిన ట్రాన్స్‎క్షన్ వివరాలను పోలీసులకు అందజేశానని తెలిపాడు. మానే ఫిర్యాదును స్వీకరించామని సాంగ్లీ పోలీసులు ధ్రువీకరించారు. ఫిర్యాదుదారుడు సమర్పించిన పత్రాలు పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

►ALSO READ | Abhishek Sharma: సింగిల్ తీయడానికి ఆడే బంతులు అవి.. అభిషేక్ ఏకంగా ఫిఫ్టీ కొట్టేస్తున్నాడు: గవాస్కర్ సెల్ఫ్ సెటైర్

కాగా, భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధనా, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో రద్దైన విషయం తెలిసిందే. 2025, నవంబర్ 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో పెళ్లి ఆగిపోయింది. ఏమైందో తెలియదు కానీ చివరకు ఈ పెళ్లి రద్దు అయ్యింది.

 పలాష్ ముచ్చల్ ఓ లేడీ కొరియోగ్రాఫర్‎తో చేసిన చాట్ లీక్ కావడంతోనే పెళ్లి క్యాన్సిల్ అయిందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో స్మృతిని మోసం చేశాడంటూ పలాష్‎పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పలాష్‎పై చీటింగ్ ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు అందటం గమనార్హం. దీంతో ఎవరైనా ఖర్మ ఫలితం అనుభవించాల్సిందేనని స్మృతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. పలాష్‎పై ఫిర్యాదు చేసిన వైభవ్ మానే స్మృతి ఫ్యామిలీకి దగ్గరి వ్యక్తే కావడం ఇక్కడ మరో విశేషం.