తప్పిపోయిన పిల్లలను వెతికే ‘మిషన్ దర్పణ్’..!

తప్పిపోయిన పిల్లలను వెతికే ‘మిషన్ దర్పణ్’..!

హైదరాబాద్: మిషన్ దర్పణ్… తప్పిపోయిన పిల్లలను క్షణాల్లో పట్టుకొవడానికి తెలంగాణ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్. ఇందులో భాగంగా… బుధవారం తమ పిల్లవాడు తప్పిపోయాడని ఓ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అలెర్ట్ అయిన రాచకొండ పోలీసులు పిలగాడి వివరాలు తెలుసుకుని గాలించారు. దీంతో కుషాయిగూడలో పోలీసులు ఓ బాబును గుర్తించారు. ఫేషియల్ రికగ్నిషన్ టూల్ తో పోల్చుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తల్లిదండ్రులకు సమాచారం అందించాగా.. ఆ బిడ్డను చూసి అది తమ కొడుకేనని కన్నీళ్లు పెట్టుకున్నారు. సత్వరమే పోలీసులు స్పందించి తమ కొడుకును వెదికిపెట్టినందుకు వారు థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియోను IPS ఆఫీసర్ స్వాతి లక్రా ట్విటర్ లో పెట్టారు. నెటిజన్లు పోలీసులను అభినందిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ ను లైక్ చేశారు.