గండిపేట: ఫాంహౌస్లలో పేకాట!..మొత్తం డబ్బులో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ యజమానికి 10 శాతం కమీషన్‌‌‌‌‌‌‌‌

గండిపేట: ఫాంహౌస్లలో పేకాట!..మొత్తం డబ్బులో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ యజమానికి 10 శాతం కమీషన్‌‌‌‌‌‌‌‌
  •     పోలీసుల రైడ్​..ఐదుగురు అరెస్ట్​

గండిపేట, వెలుగు : మైలార్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌పల్లి పరిధిలోని ఓ ఫాంహౌస్​ను అడ్డాగా చేసుకుని పేకాడుతుండగా పోలీసులు రైడ్​ చేసి ఐదుగురిని పట్టుకున్నారు. మరో నలుగురు పరారయ్యారు. రూ.9.30 లక్షల  నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటల్ షా బాబా దర్గా సమీపంలోని వట్టేపల్లిలోని కేకేకే మా ఘర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో కొంతకాలంగా భారీ స్థాయిలో డబ్బులు పెట్టి పేకాడుతున్నారు. 

దీంతో పోలీసులు సోమవారం రైడ్స్​ నిర్వహించారు. విచారణలో కొన్ని నెలలుగా పేకాడుతున్నారని, పేకాట ఆడగా వచ్చిన మొత్తంలో 10 శాతం కమీషన్‌‌‌‌‌‌‌‌ను ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ యజమాని ఖదీర్‌‌‌‌‌‌‌‌కు, అనుచరురాలు షీలా అలియాస్ శామ్ ద్వారా చెల్లిస్తున్నట్లు తేలింది. నగదుతో పాటు 6 స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఖదీర్, షీలా అలియాస్ శామ్, మోత్కూరి నర్సింహ, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ షకీల్ అహ్మద్, ఇన్నా రెడ్డి, శేఖర్ బాబు, మీర్జా, యూసుఫ్‌‌‌‌‌‌‌‌లపై కేసు నమోదు చేశారు.