- రౌంటేబుల్ మీటింగ్‌లో వార్నింగ్
పంజాగుట్ట, వెలుగు : తెలంగాణ మహిళా కళాకారులైన శివజ్యోతి, మధుప్రియను అసభ్య పదజాలంతో దూషించిన రాజ్భోడా పై కఠిన చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో తెలంగాణ వికాస సమితి, తెలంగాణ కవులు, కళాకారుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమితి అధ్యక్షుడు సుద్దయ్య, మద్దెల సందీప్, సీనియర్జర్నలిస్టులు విప్లవ శ్రీ, కవితి, విజయానంద, మానుకోట ప్రసాద్, శివారెడ్డి, శంకర్ గౌడ్, రాచకొండ రమేష్, గొల్లల వాణి, సరిత, రాకేష్, శ్యామల మాట్లాడుతూ రాజ్భోడా భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంతో కలిసి రాజ్బోడా పై చర్యలకు ఉపక్రమించాలని కోరారు.
