ఓటరు లిస్టులో పేర్లు లేనోళ్లు అప్లై చేసుకోండి : జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్ కర్ణన్

ఓటరు లిస్టులో పేర్లు లేనోళ్లు అప్లై చేసుకోండి :  జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్ కర్ణన్
  •     21లోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలి
  •     జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్ కర్ణన్​
  •     రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు:  ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు ఈ నెల 21వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. 30న తుది ఓటరు జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబితాలో చోటు కల్పించేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సోమవారం జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ హెడ్డాఫీసులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. 

ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులను గుర్తించి, వారు గడువులోగా దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేయాలని కమిషనర్ సూచించారు. బీఎల్ఏల ద్వారా అర్హులైన ఓటర్లను గుర్తించి ఫారాలు సమర్పించేలా చూడాలని కోరారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌–-రంగారెడ్డి–-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి, అవసరమైన సూచనలు, అభిప్రాయాలను అందించాలని కమిషనర్ కోరారు. అడిషనల్ కమిషనర్ బి సంతోష్ కుమార్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.