
బషీర్బాగ్, వెలుగు: అబిడ్స్ జగదీశ్ మార్కెట్లోని మాతాజీ, ఆర్.జి మొబైల్, రాజారామ్, న్యూ డ్రీమ్స్ సెల్ ఫోన్ షాపులపై ఆదివారం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేశారు. పెద్ద ఎత్తున నకిలీ యాపిల్ యాక్ససిరీస్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఇయర్ ప్యాడ్స్, పవర్ బ్యాంక్స్ , లోగో స్టికర్స్, ఆడప్టార్స్ , యూఎస్బీ కేబుళ్లు, బ్యాటరీలు ఇతర పరికరాలు ఉన్నాయి.
యాపిల్ కంపెనీ ప్రతినిధుల ఇచ్చిన సమాచారంతో నలుగురు వ్యాపారులు విక్రమ్ సింగ్, సురేశ్ కుమార్ రాజ్ పుత్, మహ్మద్ సర్ఫరాజ్, నాతురామ్ చౌదరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.కోటి విలువైన నకిలీ పరికరాలను సీజ్ చేశారు. కేసు దర్యాప్తు నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. దీంతో కాపీ రైట్స్ యాక్ట్ , ఫోర్జరి సెక్షన్ల కింద అబిడ్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.