బషీర్బాగ్/అంబర్పేట/ ఘట్కేసర్, వెలుగు: సిటీలో శుక్రవారం వేర్వేరు చోట్ల భారీగా నిషేధిత చైనా మాంజా పట్టుబడింది. సుల్తాన్బజార్ప్రాంతంలో కందేశ్ పవన్ కుమార్, రోహిత్ అగర్వాల్, బి.నిఖిల్, మహ్మద్ మాలిక్, అబ్దుల్ కరీమ్ కలిసి ఓ షటర్ అద్దెకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా చైనా మాంజా అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో శుక్రవారం సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ రైడ్ చేసి, ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 155 బాబిన్ల గోల్డ్ చైనీస్ మాంజాను సీజ్ చేశారు.
తదుపరి చర్యలు నిమిత్తం నిందితులను సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు. అంబర్పేటలో హేమంత్ కుమార్, కరీం, మదర్ ఖాన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, వీరి నుంచి 86 చైనా మాంజా బాబిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఘట్కేసర్ డివిజన్ ఈడబ్ల్యూఎస్ కాలనీలోని ఓ దుకాణంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. రంజీత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, 7 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు.
