బీఎంఎక్స్ రేసింగ్‌‌‌‌లో హైదరాబాద్ రేసర్ చంద్రశేఖర్ సత్తా

బీఎంఎక్స్ రేసింగ్‌‌‌‌లో హైదరాబాద్  రేసర్ చంద్రశేఖర్ సత్తా

హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని ఓక్లహోమాలో జరిగిన యూఎస్‌‌‌‌ఏ గ్రాండ్ నేషనల్స్  రేసింగ్‌‌లో హైదరాబాద్‌‌‌‌కు చెందిన అగస్తీ చంద్రశేఖర్ సత్తా చాటాడు. ప్రపంచవ్యాప్తంగా 48 మంది అత్యుత్తమ రైడర్లు పాల్గొన్న అండర్‌‌‌‌‌‌‌‌16 విభాగంలో చంద్రశేఖర్ నాలుగో స్థానం కైవసం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌‌‌గా నిలిచాడు. 

ఇటీవల అమెరికాలో జరిగిన అరిజోనా నేషనల్స్‌‌‌‌లో నాలుగు స్వర్ణాలు, నెవాడా స్టేట్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఒక స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇండియాలో సరైన బీఎంఎక్స్ ట్రాక్ సౌకర్యాలు లేకపోయినప్పటికీ, మలేసియా, అమెరికా వంటి దేశాల్లో కఠినమైన శిక్షణ పొందుతున్న 16 ఏండ్ల అగస్తీ 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌‌‌‌లో గోల్డ్ సాధించాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నాడు.