
హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం దంచికొడుతోంది. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,అమీర్ పేట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బోరబండ, కూకట్ పల్లి, మియాపూర్ ,కుత్బుల్లాపూర్, నిజాంపేట్, బాచుపల్లిల, కొంపల్లి, గాజులరామారాం, సూరారం, జీడిమెట్లలో వర్షం పడుతోంది.
బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్, కిస్మత్ పూర్, బండ్లగూడలో వడగండ్లతో వర్షం పడుతోంది. మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, హిమాయత్ సాగర్ గండిపేట్ తదితర ప్రాంతంలో వర్షం పడుతోంది.
Also Read : హయత్ నగర్లో తగలబడ్డ కారు.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
వర్షంతో ప్రధాన రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సికింద్రాబాద్ టూ హైటెక్ సిటీ, ఖైరతాబాద్ టూ కూకట్ పల్లి, హైటెక్ సిటీ టూ లింగంపల్లి రూట్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో రోడ్లపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
మరో వైపు మే 1 రాత్రి7గంటల నుంచి 10 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.