
హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రన్నింగ్ కారులో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వ్యక్తులు వెంటనే దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విజయవాడ వైపు నుంచి హయత్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డుపై షాపులు ఉండటంతో జనం భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
Also Read : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..మరో 3 గంటలు జాగ్రత్త
కారు ప్రమాదంతో విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు.