
చందానగర్, వెలుగు: ఆగివున్న చెత్త ఆటోను బైక్‌ఢీకొన్న ఘటనలో ఓ ర్యాపిడో రైడర్ మృతిచెందాడు. చందానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్సీపురం సాయినగర్ కాలనీకి చెందిన ఎం.తరుణ్(25) ర్యాపిడో రైడర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున తన స్కూటీపై నల్లగండ్ల నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్నాడు. ఫ్లైఓవర్‌పై ఆగివున్న జీహెచ్ఎంసీ చెత్త ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తరుణ్ తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి దీపిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.