హైదరాబాద్లో పలుచోట్ల వర్షం..ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో పలుచోట్ల వర్షం..ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో   పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చాలా ప్రాంతాల్లో వెదర్ కూల్ అయ్యింది. బంజారహిల్స్,జూబ్లీహిల్స్, పంజాగుట్ట,అమీర్ పేట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్ పల్లి, లింగంపల్లి, బాల్ నగర్, చింతల్,  ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షం నీళ్లు చేరడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనదారులు  ఇబ్బందిపడుతున్నారు.   హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

అటు జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతోంది.  మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్ మెంట్. సిటీ సహా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు.