మూసీ ఒడ్డున జియో సెల్ రోడ్.. విదేశీ టెక్నాలజీతో నిర్మిస్తున్న హెచ్ఆర్​డీసీఎల్

మూసీ ఒడ్డున జియో సెల్ రోడ్.. విదేశీ టెక్నాలజీతో నిర్మిస్తున్న హెచ్ఆర్​డీసీఎల్

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్​డీసీఎల్)​ కొత్త రకమైన జియో సెల్ రోడ్​ను నిర్మిస్తున్నది. అంబర్ పేట అలీకేఫ్ చౌరస్తా నుంచి మూసీ నదీ ఒడ్డు వరకు ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి. 

సిటీలో వరదలు వచ్చినప్పుడు మూసీ ఒడ్డున బీటీ, సీసీ రోడ్లు పాడవుతున్నాయని.. దీంతో విదేశీ టెక్నాలజీతో జియో సెల్ రోడ్​ను నిర్మిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. భారీ వర్షాలు, వరదలకు కొట్టుకుపోకుండా ఈ రోడ్లు తట్టుకుంటాయన్నారు.