లాక్డౌన్ లో సడలింపులు.. జనంతో నిండిన హైదరాబాద్ రోడ్లు

లాక్డౌన్ లో సడలింపులు.. జనంతో నిండిన హైదరాబాద్ రోడ్లు

మంగళవారం నుంచి లాక్డౌన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దాంతో హైదరాబాద్ రోడ్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 6గంటల నుంచే మార్నింగ్ వాకర్స్ తో రోడ్లన్నీ బిజీబిజీగా మారిపోయాయి. సడలింపులు ఇవ్వడంతో వాహనాలు కూడా భారీగా రోడ్లెక్కాయి. దాంతో పలు చౌరస్తాల వద్ద ట్రాఫిక్ జాం కూడా అయింది.

నగరంలో షాపులను కూడా తెరుచుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. సరి బేసి విధానాన్ని అనుసరించి షాపులు ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో జీహెచ్ఎంసీ నగరంలోని షాపులకు నెంబర్లు కేటాయించనుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఏయే షాపులు ఓపెన్ చేయాలో డిసైడ్ చేస్తారు. సరి బేసి విధానాన్ని ఏ షాపు పాటించకపోయినా… ఆ రోడ్డులో ఉన్న మిగతా షాపులన్నింటిని మూసివేయాలని మునిసిపల్ శాఖ జీహెచ్ఎంసిని ఆదేశించింది. అలాగే ప్రతి షాపు వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించింది. షాపుల వద్ద శానిటైజర్ ఏర్పాటు చేయడంతో పాటు షాప్ కీపర్ తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశించింది. షాపుకు వచ్చిన వారు కూడా మాస్క్ ధరిస్తేనే వస్తువులు ఇవ్వాలని సూచించింది. మాస్కులు ధరించకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారికి సంబంధిత విభాగాల అధికారులు వెయ్యి రూపాయల ఫైన్ విధించాలని సూచించింది.

For More News..

బస్సుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని జనం

ఇక్కడెందుకు కూర్చున్నారన్నందుకు కాల్చి చంపిన దుండగులు

కిస్సింగ్ వీడియో వైరల్.. యువతుల్ని చంపేసిన కుటుంబసభ్యులు

విడాకులకు దరఖాస్తు చేసిన ప్రముఖ నటుడి భార్య