- మంచిరేవుల వద్ద ఘటన
- సోషల్‌మీడియాలో వీడియో పోస్ట్
- హైదరాబాద్‌లో రక్షణ ఏదని ప్రశ్న
నార్సింగి, వెలుగు: నార్సింగిలోని మంచిరేవుల సైకిల్ట్రాక్వద్ద జాగింగ్చేస్తున్న యువతితో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు యువకుడి వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేసి హైదరాబాద్‌లో మహిళలకు, యువతులకు రక్షణ ఏదని ఆమె ప్రశ్నించింది. తెల్లవారుజామున ఆరు గంటలకు సదరు యువతి జాగింగ్చేస్తుండగా ఓ పోకిరీ పక్కన పొదల్లో ఓ పోకిరి ఆమెను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటికే ఆమె ఫోన్లో వీడియో ఆన్‌చేసి ఉండడంతో అతడి తీరును చిత్రీకరించింది.
దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేసి సిటీ భద్రతపై కామెంట్లు చేసింది. ‘సైకిల్ట్రాక్ఉదయం వేళలో తీవ్రమైన రద్దీగా ఉంటుంది. అయినా ఇలాంటి పనులు చేస్తున్నారు. రన్నింగ్ డ్రెస్‌లో ఉన్నా కూడా నేను సేఫ్‌గా ఫీల్కాలేకపోతున్నా..ఈ డ్రెస్సులో ఆటోలు, బైక్‌లపై వచ్చినా వారి చూపులను తట్టుకోలేకపోతున్నా.. హైదరాబాద్ సురక్షితమైన నగరమేనా? ’ అని ప్రశ్నించారు. ఘటనపై కేసు నమోదైందని, దర్యాప్తు చేస్తున్నామని నార్సింగి పోలీసులు తెలిపారు.

