వరల్డ్ బెస్ట్ 100 సిటీస్ లో హైదరాబాద్ ..82వ ప్లేస్లో మన నగరం

వరల్డ్ బెస్ట్ 100 సిటీస్ లో  హైదరాబాద్ ..82వ ప్లేస్లో మన నగరం
  • బెంగళూరుకు 29, ముంబైకి 40, ఢిల్లీకి 54వ స్థానం 
  • రెసోనెన్స్, ఇప్సోస్ ‘వరల్డ్స్ బెస్ట్ 
  • సిటీస్’ రిపోర్టులో ర్యాంకులు 
  • 'టేస్టీ అట్లాస్' టాప్‌‌‌‌ టేస్టీ సిటీల్లో 
  • హైదరాబాద్​కు 50వ ప్లేస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచంలోని ఉత్తమ నగరాల జాబితాలో మన దేశంలోని నాలుగు సిటీలకు చోటు దక్కింది. వరల్డ్ బెస్ట్100 సిటీస్ లో బెంగళూరు 29, ముంబై 40, ఢిల్లీ 54వ ప్లేస్ దక్కించుకోగా.. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 82వ ప్లేస్ లో నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్‌‌కు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది. టాప్100 టేస్టీ నగరాల జాబితాలోనూ మన సిటీ 50వ స్థానాన్ని సాధించింది. రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కలిసి 'వరల్డ్స్ బెస్ట్ సిటీస్' రిపోర్టులో భాగంగా మొత్తం 276 నగరాలను పరిశీలించి, ర్యాంకులు ప్రకటించాయి. ఈ ర్యాంకింగ్‌‌లో 34 కేటగిరీలను పరిగణనలోకి తీసుకున్నారు. లివబిలిటీ, లవబిలిటీ, ప్రాస్పరిటీ వంటి అంశాలపై విశ్లేషణ చేశారు. ఈ జాబితాలో 'క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్'గా పేరున్న లండన్ వరుసగా11వ సారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో న్యూయార్క్, మూడో స్థానంలో ప్యారిస్, నాలుగో స్థానంలో టోక్యో, ఐదో స్థానంలో మాడ్రిడ్, ఆరో స్థానంలో సింగపూర్, ఏడో స్థానంలో రోమ్, ఎనిమిదో స్థానంలో బెర్లిన్ నిలిచాయి.  

బెంగళూరు ఫస్ట్​

మన దేశంలో నాలుగు నగరాలు ఈ బెస్ట్ 100 సిటీస్ జాబితాలో చోటు పొందగా.. వాటిలో బెంగళూరు టాప్​లో నిలిచింది. టెక్ ఎకోసిస్టం, విస్తరించిన కార్పొరేట్ బేస్ వల్ల బెంగళూరు 29వ స్థానాన్ని సాధించింది. ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇన్నొవేషన్ కేంద్రంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై 40వ స్థానంలో నిలిచింది. రాజకీయ ప్రభావం, రవాణా కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా ఢిల్లీ 54వ స్థానంలో నిలిచింది. ఇక టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ 82వ స్థానం సాధించింది. 

దేశంలోనే పెద్ద సిటీగా హైదరాబాద్ 

ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాలో 82వ స్థానం, ఇండియాలో 4వ స్థానం సాధించడం ద్వారా హైదరాబాద్​సత్తా చాటింది. చెన్నై, కోల్​కతా వంటి నగరాలను సైతం పక్కన పెట్టి హైదరాబాద్ ​ముందంజలో నిలవడంపై నగరవాసులు హర్షం వెలిబుచ్చారు. 

 టేస్టీ ఫుడ్ కు కేరాఫ్ 

హైదరాబాద్ కేవలం ఆర్థిక, వ్యాపార, సాంకేతిక కేంద్రంగానే కాకుండా.. ఆహార ప్రియులకు స్వర్గధామంగా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. మొఘలాయి, అరబిక్, టర్కిష్ , పర్షియన్ వంటకాలతో హైదరాబాద్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీమ్, మిర్చీ కా సాలన్, ఉస్మానియా బిస్కెట్ వంటివి దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా, 'టేస్టీ అట్లాస్' సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్100 టేస్టీ నగరాల జాబితాలో హైదరాబాద్ 50వ స్థానం సాధించింది. ఈ గుర్తింపు హైదరాబాద్ వంటకాల నాణ్యత, వైవిధ్యం, తక్కువ ధరలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. అన్ని రుచులు అందుబాటులో ఉండడం వల్ల ఈ నగరం ఆహార ప్రియులకు ఆకర్షణీయంగా మారింది. టేస్టీ అట్లాస్ వంటి ప్లాట్‌‌ఫామ్‌‌లలో హైదరాబాద్ వంటకాలు నిరంతరం ప్రశంసలు అందుకోవడంతో సిటీలో ఫుడ్ కల్చర్​కు గణనీయమైన పేరు వస్తోంది.