V6 News

భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేక.. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి సూసైడ్‌‌‌‌‌‌‌‌

భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేక.. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి సూసైడ్‌‌‌‌‌‌‌‌
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కూకట్‌‌‌‌‌‌‌‌పల్లిలో ఘటన

కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : భార్య తన మాట వినడం లేదని, ఉద్యోగం చేయొద్దని చెప్పినా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఓ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కేపీహెచ్‌‌‌‌‌‌‌‌బీ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌‌‌‌‌‌‌‌బీ పరిధిలోని సర్దార్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న సింగారం సాయిరాం (31)కు పది నెలల కింద తేజ అనే యువతితో వివాహమైంది.

సాయిరాం సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగం చేస్తుండగా.. తేజ ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలో పనిచేస్తోంది. తేజ ఉద్యోగం చేయడం సాయిరాం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఉద్యోగం మానెయ్యాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు తేజ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం సాయిరాం తన భార్యని బస్టాండ్‌‌‌‌‌‌‌‌ వద్ద దించి తిరిగి ఇంటికి వచ్చాడు.

మధ్యాహ్నం తేజ ఎన్నిసార్లు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసినా సాయిరాం లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఆమె ఇంటికి వచ్చి డూప్లికేట్‌‌‌‌‌‌‌‌ కీతో డోర్‌‌‌‌‌‌‌‌ తెరిచి చూసే సరికి సాయిరాం ఉరి వేసుకొని కనిపించాడు. స్థానికుల సాయంతో సమీపంలోని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కేపీహెచ్‌‌‌‌‌‌‌‌పీ పోలీసులు తెలిపారు.