వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌

వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌


న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌ వచ్చే నెల 26 నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికైంది. క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో  పాటు రీసెంట్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్ పాయింట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా అన్ని కేటగిరీల్లో షూటర్లను సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఇషా సింగ్‌‌‌‌‌‌‌‌..  విమెన్స్‌‌‌‌‌‌‌‌ 10మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌,   25 మీ. స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌తో పాటు  25 మీ. ర్యాపిడ్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌, 10మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్లలో ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించింది. సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ ప్రమాణాలు అందుకోకపోవడంతో ఒలింపియన్స్‌‌‌‌‌‌‌‌ మను భాకర్‌‌‌‌‌‌‌‌, అపూర్వి చండీలా, అంజుమ్‌‌‌‌‌‌‌‌ మౌద్గిల్‌‌‌‌‌‌‌‌, అభిషేక్‌‌‌‌‌‌‌‌ వర్మ, దీపక్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, యశస్విని దేశ్వాల్‌‌‌‌‌‌‌‌ ఈ టోర్నీకి సెలెక్ట్ అవ్వలేదు.