హైదరాబాద్: రాజస్తాన్‌తో శనివారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్–డి ఎలైట్ మ్యాచ్‌లో హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. రాహుల్ రాధేశ్ (85 బ్యాటింగ్), రాహుల్ సింగ్ (55) హాఫ్ సెంచరీలు చేయడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 295/7 స్కోరు చేసింది. రాధేశ్‌తో పాటు తనయ్ త్యాగరాజన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.
11 ఓవర్లలోపే ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (6), అభిరత్ రెడ్డి (9) పెవిలియన్‌కు వచ్చేశారు. ఈ దశలో హిమతేజ (39), రాహుల్ సింగ్ మూడో వికెట్‌కు 80 రన్స్ జత చేశారు. కానీ వరుస విరామాల్లో ఈ ఇద్దరితో పాటు వరుణ్ గౌడ్ (23) కూడా ఔట్‌కావడంతో హైదరాబాద్ 150/5తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌లో రాధేశ్, రోహిత్ రాయుడు (47) నిలకడగా ఆడి ఆరో వికెట్‌కు 117 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. చామ మిలింద్ (14) నిరాశపర్చాడు. అశోక్ శర్మ రెండు వికెట్లు తీశాడు.
