దొంగ పోలీస్..రికవరీ చేసిన ఫోన్ కాజేసిన కానిస్టేబుల్

దొంగ పోలీస్..రికవరీ చేసిన ఫోన్ కాజేసిన కానిస్టేబుల్
  • లాకర్ నుంచి రూ.1.75 లక్షల ఖరీదైన సెల్ఫోన్ మాయం

హైదరాబాద్: దొంగ ఎత్తుకెళ్లిన ఫోన్ను పోలీసులు రికవరీ చేస్తే.. దాన్ని కాస్త ఇంటి దొంగ కాజేసిండు. ఈ ఘటన హైదరాబాద్ లోని మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

స్థానిక రైతు బజార్ వద్ద తన ఫోన్ పోయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. స్పందించిన మెహిదీపట్నంపోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకొని రూ.1.75 లక్షల ఖరైదీన ఫోన్ ను  రికవరీ చేశారు. 

దాన్ని కాస్త పోలీస్ స్టేషన్ లోని లాకర్ లో భద్రపరచగా.. అక్కడ డ్రైవర్ గా విధులు నిర్వహించే కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ కాజేసినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు కూడా షాక్అయ్యారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు  తరలించారు.