V6 News

రెడ్, ఎల్లో స్పాట్లు లేకుండా చేయండి : ఎంఎంసీ కమిషనర్ వినయ్కృష్ణా రెడ్డి

రెడ్, ఎల్లో స్పాట్లు లేకుండా చేయండి : ఎంఎంసీ కమిషనర్ వినయ్కృష్ణా రెడ్డి
  •     ఎంఎంసీ కమిషనర్ వినయ్​కృష్ణా రెడ్డి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెత్త వేసే పాయింట్లపై నజర్ పెట్టాలని, అట్లాంటి చోట్ల మళ్లీ చెత్త కనిపిస్తే ఊరుకునేది లేదని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను హెచ్చరించారు. గురువారం తార్నాకలోని హెడ్ ఆఫీసులో స్వచ్ఛ భారత్ మిషన్ పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 

కమిషనర్ మాట్లాడుతూ సిటీలో పాన్, గుట్కా ఉమ్మి వేసే ‘రెడ్ స్పాట్లు’, బహిరంగ మూత్ర విసర్జన చేసే ‘ఎల్లో స్పాట్ల’ను గుర్తించి, లేకుండా చేయాలన్నారు. మెయిన్ రోడ్లు, కమర్షియల్ ఏరియాల్లో డస్ట్‌‌‌‌బిన్లు పెట్టాలన్నారు. జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ పాల్గొన్నారు.