
హైదరాబాద్సిటీ : దసరా, దీపావళి, ఛత్ పూజా పండుగల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. పూరి–పాట్నా మధ్య ప్రతి శనివారం (ఆగస్టు 30) నడిచే స్పెషల్ ట్రైన్(నం. 08439)ను ఈ నెల 13 నుంచి 29వ తేదీ వరకు పొడించారు. అలాగే.. పాట్నా–పూరి మధ్య ప్రతి ఆదివారం నడిచే ట్రైన్ (నం. 08440)ను ఈ నెల 14 నుంచి 29 వరకు, భువనేశ్వర్–యశ్వంత్పూర్ మధ్య ప్రతి శనివారం నడిచే రైల్(నం. 02811)ను ఈ నెల 13 వరకు, భువనేశ్వర్ –యశ్వంత్పూర్ మధ్య ప్రతి సోమవారం నడిచే రైలు(నం. 02812)ను ఈ నెల 15 నుంచి డిసెంబరు 1 వరకు, విశాఖ–ఎస్ఎం వీటి మధ్య ప్రతి ఆదివారం నడిచే ట్రైన్ (నం. 08581)ను ఈ నెల 14 నుంచి నవంబరు30 వరకు, ఎస్ఎంవీటి–విశాఖ మధ్య ప్రతి సోమవారం నడిచే ప్రత్యేక రైలు(నం. 08582 )ను ఈ నెల 15 నుంచి డిసెంబరు 1వరకు, విశాఖ–తిరుపతి మధ్య ప్రతి బుధవారం నడిచే ప్రత్యేక రైలు(నం.08547)ను అక్టోబరు 1 నుంచి నవంబరు 26 వరకు, తిరుపతి–విశాఖపట్నం మధ్య ప్రతి గురువారం నడిచే ప్రత్యేక రైలు(నం.08548)ను అక్టోబరు 2 నుంచి నవంబరు 27 వరకు, విశాఖ–చర్లపల్లి మధ్య ప్రతి శుక్రవారం నడిచే ప్రత్యేక రైలు(నం.08579)ను అక్టోబరు 3 నుంచి నవంబరు 28 వరకు, చర్లపల్లి–విశాఖ మధ్య ప్రతి శనివారం నడిచే ప్రత్యేక రైలు(నం.08580 )ను అక్టోబరు 4 నుంచి 29, నవంబరు వరకు నడపనున్నట్టు అధికారులు వివరించారు.
హైదరాబాద్ - తిరుపతి ప్రత్యేక రైలు ..
చర్లపల్లి –తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైలును దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నవంబరు 26 వరకు పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి–తిరుపతి మధ్య నడిచే ట్రైన్ (నం. 07013)ను నవంబరు 25 వరకు ప్రతి మంగళవారం నడపనున్నట్టు చెప్పారు. అలాగే తిరుపతి–చర్లపల్లి మధ్య నడిచే ట్రైన్( నం.07014) నవంబరు 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణీకులకు సేవలు అందించనుంది.