మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి: గవర్నర్​ జిష్ణు దేవ్ వర్మ

మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలి: గవర్నర్​ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ మర్రిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లోని దాశరథి ఆడిటోరియంలో  టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.  ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్​ జిష్ణు దేవ్ వర్మ  మాట్లాడుతూ .. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, జాన్ డ్యూయీ,  రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్ప నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.  గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులను అభినందించి  ప్రోత్సహించారు.

TISS వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ తివారీ అతిథులకు స్వాగతం పలికారు. . 22 రాష్ట్రాలు ... 3 కేంద్రపాలిత ప్రాంతాలలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS)  సాధించిన  విజయాలను వివరించారు. TISS హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్  ప్రొఫెసర్ అసీమ్ ప్రకాష్,  వార్షిక నివేదికను సమర్పించారు. TISS ఛాన్సలర్ ప్రొఫెసర్ D. P. సింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులను అభినందించారు.  వైస్​ ఛాన్స్​లర్​ విద్యార్థులకు సర్టిఫెకెట్​ లను  పంపిణి చేశారు.  201 మంది విద్యార్థులకు మాస్టర్స్ డిగ్రీ, 14 మంది విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమ, ఇద్దరికి పీహెచ్​డీ పట్టాలు అందజేశారు.  ఇంకా పలు కోర్సుల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పతకాలు, బహుమతులను ప్రదానం చేశారు.