అడ్రస్ చెప్పకుండా..2  గంటలు సతాయింపు

అడ్రస్ చెప్పకుండా..2  గంటలు సతాయింపు
  • ఎట్టకేలకు స్పూర్తిరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

గండిపేట్,వెలుగు : లంచం తీసుకుంటూ పట్టుబడిన మణికొండ వాటర్ బోర్డు మేనేజర్‌‌ స్ఫూర్తిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కొత్త నల్లా కనెక్షన్లకు ఓ దరఖాస్తుదారుడి నుంచి మంగళవారం రూ. 30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కినది తెలిసిందే. దీంతో స్ఫూర్తిరెడ్డిని అదుపులోకి తీసుకోగా.. ఆమె ఇంట్లో అక్రమ ఆస్తులపై సోదాలు చేసేందుకు నిర్ణయించారు.

అయితే.. ఏసీబీకి తన ఇంటి అడ్రస్ చెప్పకుండా స్ఫూర్తిరెడ్డి 2 గంటల పాటు సతాయించారు. ఎట్టకేలకు మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడలో ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకుని ఏసీబీ అధికారులు సోదాలు చేసి.. కీలక డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.