హిమాచల్ లో పారాగ్తైడింగ్ చేస్తూ.. హైదరాబాద్ టూరిస్ట్ మృతి

హిమాచల్ లో పారాగ్తైడింగ్ చేస్తూ.. హైదరాబాద్ టూరిస్ట్ మృతి

హిమాచల్ ప్రదేశ్లో హైదరాబాద్కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు పారాగ్లైడింగ్ ప్రమాదంతో మృతిచెందింది. 26 యేళ్ల యువతి పారాచూట్తో గాల్లో ఎగురు తుండగా సెఫ్టీబెల్ట్ ఊడిపోయి ఒక్కసారిగా కిందపడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.

పారాగ్లైడింగ్ సమయంలో పైలట్ టూరిస్ట్ సేఫ్టీ బెల్ట్ ను సరిగ్గా అమర్చక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని.. దీంతో చాలా ఎత్తు నుంచికిందపడి యువతి మృతిచెందిందని పోలీసులు తెలిపారు. ఈఘటన కారణమైన పైలట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రమాదం జరిగినప్పుడు వాతావరణం బాగానే ఉందని.. సైట్, పరికరాలు అన్నీ సరిగ్గానే ఉన్నాయని.. మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కులూ టూరిజం అధికారులు చెబుతున్నారు. కులూ ప్రాంతీయ ఆస్పత్రిలో యువతి మృతదేహం పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

ఈ ఘటనపై కులూ కలెక్టర్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. పాట్లీ కుహల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన తర్వాత ప్రమాదం జరిగిన కులూ లోని దోభి గ్రామంలో అన్ని పారాగ్లైడింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు.