హైదరాబాద్ అమ్మాయికి.. దుబాయ్ లాటరీ

హైదరాబాద్ అమ్మాయికి..  దుబాయ్ లాటరీ

ఒక్కోసారి జీవితంలో జరిగే కొన్ని సంఘనలు వారి లైఫ్ ను మార్చేస్తుంటాయి, అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న.. లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే హైదరాబాద్ మహిళకు వరించింది. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. తాజాగా హైదరాబాద్ మహిళ లాటరీ గెలుచు కోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. ఈ మహిళ ఏకంగా రెండు కోట్ల 20 లక్షల కోట్ల రూపాయలను గెలుచుకుంది. దుబాయ్ లో హైదరాబాద్ కు చెందిన మహిళ ఇలాంటి లాటరీ గెలవటం ఇదే ఫస్ట్ టైం కావటం విశేషం. ఈమె పేరు హమీద బేగం.. ఈమె అబుదాబిలో 2.2 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుంది.

ఈమె అబుదాబిలో నివసిస్తుంది.. మూడేళ్ళుగా మెడికల్ కోడర్ గా పని చేస్తుంది. రెగ్యులర్ గా ఓ సంస్థ నిర్వహించే లాటరీలో.. 100 రూపాయలతో టికెట్ కొనుగోలు చేసింది. ఊహించని అదృష్టం ఆమె తలుపుతట్టింది.ఈ లాటరీ లక్కీ డ్రాలో ఆమె కొనుగోలు చేసిన టికెట్ కు ఫ్రైజ్ మనీ వచ్చింది. గెలుచుకున్న డబ్బును తన నలుగురి పిల్లల చదువు, వారి పోషణ కోసం ఖర్చు చేస్తానని చెబుతోంది.మరి ఈమె లక్కీ డ్రాలో 10 లక్షల దిర్హామ్ లు గెలుచుకున్న తొలి మహిళగా రికార్డ్ క్రియేట్ చేసింది.

మనది కానిది ఎప్పటికీ దక్కదన్నట్లు.. మనది అయితే వెతుక్కుంటూ ఇంటికే వస్తుందని చెప్పటానికి ఇదో ఎగ్జాంపుల్. అదృష్టం పరీక్షించుకోవటానికి జస్ట్ 100 రూపాయలు ఖర్చు పెడితే.. రెండు కోట్లు ఇంటికి రావటం అంటే అదృష్టం కాక మరేంటీ..