
బర్మింగ్‌హామ్ : వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ గెలిచి జోరుమీదున్న హైదరాబాదీ నిఖత్ జరీన్ కామన్వెల్త్ బాక్సింగ్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా, పతకం తెస్తాడని ఆశించిన శివ థాపా ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఆదివారం జరిగిన విమెన్స్ 50 కేజీ ప్రిక్వార్టర్స్ బౌట్‌లో నిఖత్.. మొజాంబిక్‌కు చెందిన హెలెనా ఇస్మాయెల్‌ను నాకౌట్ చేసింది. వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత కొత్త వెయిట్ కేటగిరీలో తలపడుతున్న నిఖత్ తన పంచ్ పవర్ చూపెట్టింది.లెఫ్ట్, రైట్ పంచ్‌లతో హెలెనాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె ముఖంపై క్లీన్ పంచ్‌లు కొట్టింది.
నిఖత్ దెబ్బకు చివరి రౌండ్‌లో హెలెనా బిత్తరపోయింది. దాంతో, మరో 48 సెకండ్లు మిగిలుండగానే రిఫరీ బౌట్‌ను ఆపేసి నిఖత్‌ను విన్నర్‌గా ప్రకటించారు. క్వార్టర్స్‌లో నిఖత్.. గత కామన్వెల్త్ బ్రాంజ్ మెడలిస్ట్ ట్రాయ్ గార్టన్ (న్యూజిలాండ్)తో పోటీ పడుతుంది. మరోవైపు మెన్స్ 63.5 కేజీ కేటగిరీ ప్రిక్వార్టర్స్‌లో శివ థాపా 1–4తో వరల్డ్ చాంపియన్‌షిప్ బ్రాంజ్ మెడలిస్ట్ రీస్ లించ్ చేతిలో ఓడి నిరాశ పరిచాడు.
యోగేశ్వర్‌కు నిరాశ
మెన్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ ఫైనల్లో యోగేశ్వర్ సింగ్ ఓవరాల్‌గా 74.700 స్కోరుతో 15వ స్థానంతో సరిపెట్టాడు. విమెన్స్ ఆల్‌రౌండ్ ఫైనల్లో రుతుజా చివరి, 17వ స్థానంతో నిరాశ పరిచింది.
* స్లైకింగ్ మెన్స్ స్ప్రింట్ ఈవెంట్‌లో ఇండియా టాప్ సైక్లిస్ట్ రొనాల్డో ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయాడు.
* మెన్స్ 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు.
* లాన్‌బౌల్ మెన్స్ డబుల్స్‌లో దినేశ్ కుమార్–సునీల్ బహదూర్ జంట క్వార్టర్స్ చేరింది.
* స్క్వాష్ విమెన్స్, మెన్స్ సింగిల్స్‌లో జోష్న చిన్నప్ప, సౌరవ్ ఘోశాల్ క్వార్టర్స్ చేరుకున్నారు.
కామన్వెల్త్‌లో నేడు ఇండియా పోటీపడే మెయిన్ ఈవెంట్స్ (సోనీ నెట్‌వర్క్‌లో లైవ్)
వెయిట్ లిఫ్టింగ్ : అజయ్ సింగ్– మ. 2.00; హర్జిందర్ -–రా. 11.00
బాక్సింగ్ : అమిత్ పంగల్, హుస్సాముద్దీన్ ప్రిక్వార్టర్స్ బౌట్స్– సా. 4.45 నుంచి
మెన్స్ హాకీ : ఇండియా x ఇంగ్లండ్ రా. 8.30
బ్యాడ్మింటన్ : మిక్స్‌డ్ టీమ్ సెమీస్ మ. 3.30 నుంచి
మెన్స్ టీటీ సెమీస్ : ఇండియాx నైజీరియా –రా. 9 నుంచి