టీమిండియా -19లోకి మరో హైదరాబాదీ

టీమిండియా -19లోకి మరో హైదరాబాదీ

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్ నుంచి మరో యువ క్రికెటర్ మహ్మద్ మాలిక్ అండర్-19 ఇండియా ఏ టీమ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు.  వినూ మన్కడ్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్​గా నాంపల్లిలోని మల్లెపల్లికి చెందిన ఫాస్ట్ బౌలర్ మాలిక్ నిలవడంతో.. అతనికి బీసీసీఐ ఈ అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా అతని తండ్రి మహ్మద్ అబ్దుల్ సుబాన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్​లో కేక్ కట్ చేసి​ సంబురాలు నిర్వహించారు. 

మహ్మద్ ​సిరాజ్ స్ఫూర్తితో ప్రాక్టీస్ చేసి మాలిక్ అండర్ 19 టీమ్​కు సెలక్ట్​ అయినట్లు తెలిపారు. ఈ నెల 17న బెంగళూరు వేదికగా జరిగిగే ఆఫ్ఘనిస్తాన్​తో సిరీస్​లో మాలిక్ పాల్గొంటారన్నారు. 35 ఏండ్లుగా క్రికెట్ ఆడుతూ భారత్ టీమ్​కు ఆడాలనే తన డ్రీమ్​ను కొడుకు నెరవేరుస్తున్నాడని గర్వంగా చెప్పారు. భవిష్యత్​లో ఇండియన్ టీమ్​కూ ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.