హైదరాబాద్లో రెచ్చిపోయిన తాగుబోతు దొంగలు.. అమ్మవారి విగ్రహాన్ని కూడా వదల్లేదు

హైదరాబాద్లో రెచ్చిపోయిన తాగుబోతు దొంగలు.. అమ్మవారి విగ్రహాన్ని కూడా వదల్లేదు

హైదరాబాద్ లో తాగుబోతు దొంగలు రెచ్చిపోయారు. పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ నరహరి నగర్ లో శ్రీ పంట మైసమ్మ దేవాలయంలో అర్థరాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. స్ట్రీట్ లైట్స్ బంద్ చేసి.. గుడిలోకి వెళ్లారు. అమ్మవారి ఆభరానాలను అపహరణ చేశారు. ఈ క్రమంలో అమ్మవారి విగ్రహాన్ని పగలగొట్టారు. గుడిలోని సామాన్లన్ని చిందరవందర చేశారు. ఈ దృష్యాలన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

మంగళవారం 2024, 02వ తేదీ తెల్లవారు జామున అయ్యప్ప స్వాములు దర్శనానికి వెళ్లి చూడగా.. గుడి తలపులు తెరిచి ఉండటంతో వారికి అనుమానం వచ్చి.. లోపలికి వెళ్లి చూశారు. గుడిలో దొంగతనం జరిగిందని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఛత్రినాక ఏసీపీ రమేష్, సీఊ బొజ్జియా నాయక్ తోపాటు క్లోస్ టీంతో ఘటనా స్థలాలనికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.