హైడ్రా వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది..ప్రజలు మెచ్చుకుంటున్నారు: రంగనాథ్

హైడ్రా వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది..ప్రజలు మెచ్చుకుంటున్నారు: రంగనాథ్

హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడ లేదన్నారు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్. ఆగస్టు 23న మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన ఆయన.. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని  చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  మొదట హైడ్రాపై ప్రజల్లో  కొంత వ్యతిరేకత ఉండేది..ఇపుడు అందరూ  హైడ్రాను స్వాగతిస్తున్నారని తెలిపారు. హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు రంగనాథ్.  చెరువుల సుందరీకరణలో ప్రజలు హైడ్రాకు సహకరిస్తున్నారని తెలిపారు. 

2024  జూలైలో  ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ‘ హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదు. వందేళ్ళ ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ. జిహెచ్ఎంసి యాక్ట్ లో మార్పులు చేసి తమకు సంబంధించిన అధికారాలు కల్పించింది ప్రభుత్వం. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ భాగానే చేస్తున్నాం.  తమ వైపు తప్పు జరిగితే సమీక్షించుకుంటాం. హైడ్రాకు ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్ ఉంది. సీఎం,  ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు చాలా సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ది చేస్తున్నాం.  అన్ని సాంకేతిక ఆధారాలతో చెరువుల FTL మార్క్ చేస్తున్నాం. చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. 

హైడ్రాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యమైన విషయం. పర్యావరణం పరిరక్షణ కోసం ఎక్కువ పనిచేస్తున్నాం. నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీత పనులను చేస్తున్నాం.వర్షం లేనప్పుడు హైడ్రా సిబ్బంది నాలాలు.. మ్యాన్ హోల్స్ క్లీన్ చేయించడం జరుగుతుంది.చెరువుల్లో కూల్చి వేతల సమయంలో చాలా ఆరోపణలు వచ్చాయి. బతుకమ్మ కుంట, కూకట్ పల్లి చెరువులను బాగా అభివృద్ధి చేస్తున్నాం. అక్కడి వారు సంతోషిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఫోర్కాస్ట్ లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు చేస్తున్న పనులు నెక్స్ట్ 100 ఏళ్లకు ఉపయోగ పడుతుంది. 60నుంచి 65 శాతం చెరువులు మాయం అయ్యాయి. పొల్యూషన్ వల్ల అనేక సమస్యలు వచ్చాయి. CSR కింద చెరువులు కొట్టేయాలని చూస్తే ఊరుకునేది లేదు. చెరువుల మాదిరిగా నాలాలు కబ్జాలు నిరోధించేందుకు వాటిని నోటిఫై చేస్తాం.నాలాలు డెవలప్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది అని రంగనాథ్ తెలిపారు.