యువకుడి ప్రాణాలు కాపాడిన ..హైడ్రా సిబ్బందికి సన్మానం

యువకుడి ప్రాణాలు కాపాడిన ..హైడ్రా సిబ్బందికి సన్మానం

మాదాపూర్, వెలుగు: ఈ నెల 25న దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడిని కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బందిని సోమవారం హైడ్రా చీఫ్​ఏవీ రంగనాథ్  అభినందించారు. శుక్రవారం రామిరెడ్డి అనే యువ‌‌‌‌కుడు మద్యం మత్తులో భార్యతో గొడవ పడి  మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి అంచున నిల‌‌‌‌బ‌‌‌‌డి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. 

ఇది చూసిన అక్కడి డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుప‌‌‌‌తి యాద‌‌‌‌వ్‌‌‌‌, సంతోష్ చారి, మహ్మద్​ఇమ్రాన్‌‌‌‌ అతడిని పట్టుకున్నారు. వీరిని కమిషనర్ సోమవారం అభినందించి సత్కరించారు. హైడ్రా అడిషనల్​ డైరెక్టర్​వ‌‌‌‌ర్ల పాపయ్య, ఆర్ఎప్ వో జ‌‌‌‌య‌‌‌‌ప్రకాశ్, ఎస్ ఎఫ్‌‌‌‌వో స‌‌‌‌తీశ్, హైడ్రా ఇన్​స్పెక్టర్​ ర‌‌‌‌వి ఉన్నారు.