
హైదరాబాద్, వెలుగు: హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు 259 మంది ఆఫీసర్లు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు మంగళవారం ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు.
ఒక్క ఐపీఎస్, ముగ్గురు గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు, ఐదుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్ స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, ఐదుగురు రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్, ముగ్గురు అనలిటికల్ ఆఫీసర్లు, ముగ్గురు అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లను కేటాయించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. హైడ్రాకు 3,500 మంది సిబ్బంది అవసరమని హైడ్రా కమిషనర్ ప్రభుత్వాన్ని గతంలో కోరారు.