- మహానగరంలో ప్రకృతి చికిత్స చేస్తున్నం : హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న వేళ.. ప్రజలకు మెరుగైన సేవలు, పాలన అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించడానికి ఉత్తరాఖండ్ ముస్సోరీలోని లాల్ బహద్దూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మున్సిపల్ గవర్నెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్ పేరిట 5 రోజుల సదస్సు నిర్వహించారు. దీనికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు కాగా, సీనియర్ ఐఏఎస్ లు, ముఖ్య పట్టణాల మున్సిపల్ కమిషనర్లు, ఎన్‌డీఎంఏ, ఎస్‌డీఆర్ ఎఫ్ అధికారులు హాజరయ్యారు.
ఇందులో రంగనాథ్ పవర్పాయింట్ప్రజెంటేషన్ఇచ్చారు. ఈ సందర్భంగా రంగనాథ్మాట్లాడుతూ.. కాలుష్యం కారణంగా క్లౌడ్‌బరస్ట్‌లు సర్వసాధారణంగా మారిపోయిన సమయంలో వరదలకు ఆస్కారం ఉండే అంశాలపై హైడ్రా దృష్టి పెట్టిందన్నారు. నగరాల్లో ఉండే చెరువులు, నాలాలను పునరుద్ధరించి, ప్రకృతి చికిత్స చేస్తున్నామన్నారు. చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే నాలాలను పరిరక్షించడంతో పాటు పునరుద్ధరిస్తున్నామన్నారు.
ఈ రెండు చర్యలతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు వరద ముప్పును తగ్గించామన్నారు. ఇప్పటివరకు 1,313.19 ఎకరాల ఆక్రమిత భూములను (చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలు) స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 65,650 కోట్లు ఉంటుందని అంచనా ఉందన్నారు. దేశవ్యాప్తంగా హైడ్రా లాంటి వ్యవస్థ ఉండడం చాలా అవసరమని ఈ సదస్సుకు హాజరైన కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు భావించారు. హైడ్రా గురించి విన్నామని, కార్యకలాపాలను కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు.
