
తిరుమల శ్రీవారిని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని స్వామిని కోరుకున్నానని తెలిపారు. హైడ్రాను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రేవంత్ రెడ్డి పటిష్టం చేశారన్న దానం.. చెరువులు అన్యాక్రాంతం అయిన ప్రాంతంలో భూములు కబ్జాకు గురి అయ్యాయని అన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇతర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. ఆంధ్ర- ... తెలంగాణ అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. ప్రజల్లో భయాందోళనలకు గురయ్యే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని .. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.