
- ఫ్లకార్డులతో ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన బాధితులు
- వారం రోజుల్లో సమస్యను పరిష్కరించారంటూ హర్షం
కూకట్పల్లి, వెలుగు: మియాపూర్ హైదర్ నగర్ సర్వే నంబర్ 145/3లోని ఆక్రమణలను హైడ్రా అధికారులు సోమవారం తొలగించారు. 9 ఎకరాల 30 గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఇందులోని 8 ఎకరాల భూమిని 2000 సంవత్సరంలో దాదాపు 90 మంది ప్రభుత్వ, ప్రైవేట్రిటైర్డ్ ఉద్యోగులు కొనుగోలు చేశారు. ఈ లేఅవుట్లో మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి. అయితే సదరు స్థలాన్ని 2007లో డాక్టర్ ఎన్.ఎస్.డి.ప్రసాద్వ్యక్తి సదరు భూమి తనదంటూ చుట్టూ ఐరన్షీట్స్తో ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు.
భూమిని ప్రైవేట్బస్సుల పార్కింగ్ కు అద్దెకు ఇచ్చాడు. అప్పటి నుంచి ప్లాట్ల కొనుగోలుదారులు న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. 9 నెలల కింద ఈ భూమి హెచ్ఎండీఏ లేఔట్ గా హైకోర్టు తేల్చింది. ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించినా కబ్జాదారుడు స్పందిచలేదు. బాధితులు వారం కింద హైడ్రాను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం హైడ్రా అధికారులు తొలగింపు చేపట్టారు.
8 ఎకరాల భూమి చుట్టూ వేసిన ఐరన్ బారికేడ్లను, ఫెన్సింగ్‌ను తొలగించారు. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే హైడ్రా కమిషనర్తమకు న్యాయం చేశారంటూ ప్లాట్ల కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించి సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రా కమిషనర్రంగనాథ్కు థ్యాంక్స్చెప్పారు.
గుడిసెలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేత
మేడిపల్లి/శంషాబాద్: మేడిపల్లి సర్వే నంబర్103లోని స్థలంలో స్థానికులు వేసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు సోమవారం తొలగించారు. సదరు స్థలాన్ని గత ప్రభుత్వం 2018లో రజక భవనానికి కేటాయించిందని తెలిపారు. కాగా గతంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు 60 గజాలు చొప్పున ఇండ్ల పట్టాలు ఇచ్చిందని స్థానికులు వాపోయారు. పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పి పంపించారు.
అలాగే శంషాబాద్ మున్సిపాలిటీ శ్రీనివాస కాలనీ సర్వే నంబర్ 318లోని ప్రభుత్వ స్థలంలో కబ్జాదారులు చేపడుతున్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్రవీందర్ దత్ హెచ్చరించారు.