
హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల పరిరక్షణే భాగంగా ఏర్పాటైన హైడ్రా.. మరింత పటిష్టమవుతోంది. ఆక్రమణ దారుల ఆటలు కట్టించేందుకు అధికారికంగా సిద్ధమైంది. దురాక్రమణలకు పాల్పడితే కటకటాల పాలుకేనని హెచ్చరించడమే కాకుండా.. అందుకు సంబంధించి ప్రత్యేక స్టేషన్ ను సిద్ధం చేసింది. ఇప్పటి వరకు స్టేషన్ లేకుండానే కబ్జాదారులను గడగడలాడించిన హైడ్రాకు సంబంధించిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ గురువారం (మే 8) సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమవుతోంది.
హైదరాబాద్ లోని బుద్ధభవన్ పక్కనే హైడ్రా పోలీసు స్టేషన్ ను ఏర్పిటు చేశారు. ఈ స్టేషన్ కు ఎస్‌హెచ్‌వోగా ఏసీపీ తిరుమల్ వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్ కు ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు (సీఐలు), 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ కేటాయించారు. ఈ పోలీసు స్టేషన్ లో 10,500 ల చదరపు అడుగుల విస్తీర్ణం జీ ప్లస్ 2 గా నిర్మించారు.
►ALSO READ | రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం చేయండి.. నిత్యవసరాల కొరత లేకుండా చూడండి: CM రేవంత్
ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై ఇకనుంచి హైడ్రా పోలీసు స్టేషన్ లో కేసులు నమోదు చేసుకుంటారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలలో మట్టి పోసిన వారిపై కూడా హైడ్రా పీఎస్ లో కేసులు నమోదు చేస్తారు. చెరువుల్లోకి మురుగు నీరును నేరుగా వదిలిన వారిపైన కూడా కేసులు నమోదు చేయనున్నారు హైడ్రా అధికారులు.