గ‌‌చ్చిబౌలిలో 600 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా

గ‌‌చ్చిబౌలిలో 600 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా

గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్​లో రూ.11 కోట్లు విలువైన 600 గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌‌ల్లి మండ‌‌లం గ‌‌చ్చిబౌలిలో తెలంగాణ సెక్రటేరియ‌‌ట్ మ్యూచువ‌‌ల్ ఎయిడెడ్ కోప‌‌రేటివ్ సొసైటీకి చెందిన 24 ఎక‌‌రాల లేఔట్‌‌ ఉంది. 

హెచ్ఎండీఏ అనుమ‌‌తి పొందిన ఈ లేఔట్‌‌లో పార్కులు, ప్రజావ‌‌స‌‌రాల‌‌కు ఉద్దేశించిన స్థలాల‌‌ను సొసైటీ నిర్వాహ‌‌కులు అమ్మిన‌‌ట్టు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు క్షేత్ర స్థాయిలో ప‌‌రిశీలించి పార్కుల స్థలాలుగా నిర్ధారించారు. మంగళవారం రెండు పార్కుల్లో ఆక్రమ‌‌ణ‌‌ల‌‌ను తొల‌‌గించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ ప్లాట్ల విక్రయాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.