మియాపూర్ హైదర్ నగర్లో హైడ్రా కూల్చివేతలు

 మియాపూర్ హైదర్ నగర్లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల పని పడుతోంది.  ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది.  

ఇవాళ మే 19న  మియాపూర్ హైదర్ నగర్ దగ్గర  సర్వే నంబర్‌ 145/3లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 9ఎకరాల 30గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్  పేరిట అసోసియేషన్ ఏర్పాటు  చేశారు.  లే ఔట్ లో మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి.  ఆ స్థలాన్ని  పలువురు వ్యక్తులు ఆక్రమించారు.  9 నెలల కిందట హెచ్ఎండిఏ లేఔట్ గా తేల్చింది హైకోర్టు.  ఖాళీ చేయాలని హైకోర్టు  ఆదేశించినా  కబ్జా దారుల ఖాళీ చేయలేదు.దీంతో బాధితులు  హైడ్రాను ఆశ్రయించారు.  కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది హైడ్రా. 

గ్రేటర్ పరిధిలో కబ్జాకు గురైన  చెరువులు,కుంటలు,ప్రభుత్వ స్థలాలను హైడ్రా పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కట్టిన నిర్మాణాలను,పర్మిషన్ లేకుండా ఇష్టారీతిన కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచే నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే..

►ALSO READ | ధూల్​పేటలో6 కిలోల గంజాయి సీజ్

ఇటీవలే  హైడ్రా మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  హైదరాబాద్ లో బుద్ధ భవన్ పక్కనే నిర్మించిన హైడ్రా భవన్ ను మే 8న  ప్రారంభించారు సీఎం. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఇతర అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.