
మెహిదీపట్నం, వెలుగు: ధూల్‌పేటలోని రహీంపురలో 6 కిలోల గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో రహీంపురలో ఎస్టీఎఫ్ ఏ టీమ్ఆదివారం దాడులు నిర్వహించింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న నవీన్ సింగ్ ను తనిఖీ చేయగా, అతని వద్ద 6 కిలోల గంజాయి పట్టుబడింది.
దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇందూర్ అమ్రేశ్, వినోద్ లడ్డు, విజయ్ టర్కీ పరారీలో ఉండగా, వారిపై కేసు నమోదు చేశారు.