- కొండాపూర్, ప్రగతినగర్‌లో 11 ఎకరాల భూమికి ఫెన్సింగ్!
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లోని కొండాపూర్, ప్రగతినగర్‌లో రూ.1650 కోట్ల విలువగల 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. ఇందులో 2 ఎకరాలు పార్కు కోసం, 5 ఎకరాలు శ్మశాన వాటిక, 4 ఎకరాలు డంప్ యార్దు కోసం కేటాయించిన భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 2 ఎకరాలను పార్కు కోసం కేటాయించగా కొందరు ఈ భూమిని కబ్జా చేశారు. రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి మంగళవారం ఉదయం 2 ఎకరాల పార్కు స్థలంలో ఫెన్సింగ్ వేశారు.
ప్రగతినగర్‌లో 9 ఎకరాల భూమి సేఫ్..
ప్రగతినగర్ అంబీర్ చెరువు పక్కన ఉన్న 5 ఎకరాలు శ్మశాన వాటిక, 4 ఎకరాల డంపింగ్ యార్డు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఫిర్యాదుతో హైడ్రా విచారణ చేపట్టింది ఫెన్సింగ్ వేసింది.
