
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కుంట్లూర్ లో హైడ్రా సర్వే చేస్తోంది. కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని కళ్లెం వెంకట్ రెడ్డి అనే గ్రామస్థుడు హైడ్రాకు ఫిర్యాదు చేశాడు. కుంట్లూర్ కు చెందిన ఓ భూ స్వామి తన వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లేందుకు చెరువు కబ్జా చేసి రోడ్డు వేశాడని ఫిర్యాదులో తెలిపాడు.దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య పెద్దచెరువును సర్వే చేస్తున్నారు.
అయితే సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు రోడ్డు వేసిన వ్యక్తులు. సర్వే సమయంలో ప్రైవేట్ సర్వేయర్ ఎలా ఉంటాడని అధికారులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మద్య హైడ్రా అధికారులు సర్వే కొనసాగించారు.
ప్రతి సోమవారం ప్రజావాణి
హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు 2025 జనవరి నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. చెరువులు,నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని చెప్పింది హైడ్రా. ఇటీవలే చెరువులు,నాలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్నట్లు హైదరాబాద్ లో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందకు హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది.
ALSO READ | వాహనదారులు, మెకానిక్ల్లారా జాగ్రత్త.. బండి సైలెన్సర్లు మారిస్తే క్రిమినల్ కేసులు