V6 News

యువ ఆప‌‌ద మిత్రులకు హైడ్రా ట్రైనింగ్

 యువ ఆప‌‌ద మిత్రులకు హైడ్రా ట్రైనింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రకృతి వైప‌‌రీత్యాల టైంలో తమను తాము ర‌‌క్షించుకోవ‌‌డ‌‌మే కాకుండా చుట్టుప‌‌క్కల వారిని కాపాడేందుకు ఏర్పాటు చేసిన‘యువ ఆప‌‌ద మిత్ర’ వలంటీర్లకు గురువారం ఓయూలోని ప్లాటినం జూబ్లీ హాల్‌‌లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హైడ్రా చీఫ్​రంనాథ్ హాజరై మాట్లాడారు. నేష‌‌న‌‌ల్ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ అథారిటీ ప్రారంభించిన ‘యువ ఆప‌‌ద మిత్ర’ స్కీంలో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు భాగ‌‌స్వాములయ్యారన్నారు. వాతావ‌‌ర‌‌ణ కాలుష్యంతో భారీ వ‌‌ర్షాలు న‌‌మోదవుతున్నాయ‌‌ని, ఈ త‌‌రుణంలో వలంటీర్లు వివిధ శాఖ‌‌ల‌‌తో స‌‌మ‌‌న్వయంగా ప‌‌ని చేయ‌‌డానికి సిద్ధంగా ఉండాల‌‌న్నారు. ఈ సంద‌‌ర్భంగా హైడ్రాపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఓయూ వైస్ ఛాన్స్ ల‌‌ర్, సీనియ‌‌ర్ ప్రొఫెస‌‌ర్  కుమార్ మొలుగ‌‌రం, హైడ్రా అడిష‌‌న‌‌ల్ డైరెక్టర్ వ‌‌ర్ల పాప‌‌య్య, రీజ‌‌న‌‌ల్ సెంట‌‌ర్ ఫ‌‌ర్ అర్బన్ ఎన్విరాన్‌‌మెంట‌‌ల్ స్టడీస్‌‌ డైరెక్టర్ ప్రొ.న‌‌గేష్‌‌, యువ ఆప‌‌ద మిత్ర స్టేట్ నోడ‌‌ల్ ఆఫీస‌‌ర్  గౌత‌‌మ్ కృష్ణ పాల్గొని సూచ‌‌న‌‌లు చేశారు.