పీర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు.. రోడ్డుపై ఆక్రమణలు నేలమట్టం...

పీర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు.. రోడ్డుపై ఆక్రమణలు నేలమట్టం...

ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా వరుస కూల్చివేతలతో దూసుకుపోతోంది.. బుధవారం ( మే 21 ) మేడ్చల్ జిల్లాలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. జిల్లాలోని మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. సర్వే నంబర్ 26ఏ సిపీఆర్ఐ పవర్ సంస్థ, సేజ్ స్కూల్ ప్రాంగణంలో  ఆర్ఏఆర్ కాలనీకి సంబందించిన రోడ్డు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు.

స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సీఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు. హైడ్రా ప్రజావాణి ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు కూల్చివేతలు హ్చేపడుతున్నారు.మే 19న  మియాపూర్ హైదర్ నగర్ దగ్గర  సర్వే నంబర్‌ 145/3లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 9ఎకరాల 30గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్  పేరిట అసోసియేషన్ ఏర్పాటు  చేశారు.  

లే ఔట్ లో మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి.  ఆ స్థలాన్ని  పలువురు వ్యక్తులు ఆక్రమించారు.  9 నెలల కిందట హెచ్ఎండిఏ లేఔట్ గా తేల్చింది హైకోర్టు.  ఖాళీ చేయాలని హైకోర్టు  ఆదేశించినా  కబ్జా దారుల ఖాళీ చేయలేదు.దీంతో బాధితులు  హైడ్రాను ఆశ్రయించారు.  కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది హైడ్రా. 

గ్రేటర్ పరిధిలో కబ్జాకు గురైన  చెరువులు,కుంటలు,ప్రభుత్వ స్థలాలను హైడ్రా పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కట్టిన నిర్మాణాలను,పర్మిషన్ లేకుండా ఇష్టారీతిన కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచే నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే..