హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. లేఅవుట్‌లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రాకు సూచించింది.
ఎఫ్ సీఐ లే అవుట్ లో కబ్జాలు చేసి తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్ రావు రోడ్లు వేశారని కోర్టును ఆశ్రయించారు బాధితులు. సంధ్యా శ్రీధర్ రావు ఆక్రమణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హై కోర్ట్.. వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హైడ్రా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఎఫ్ సీఐ బాధితులకు అండగా నిలవాలని హైడ్రా సూచించింది.
హైకోర్టు ఆదేశాలతో సంధ్యా శ్రీధర్ రావు ఆక్రమణలపై మరోసారి చర్యలకు దిగిన హైడ్రా .. సోమవారం (నవంబర్ 17) కూల్చివేత్తలు చేపట్టింది. కోట్ల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా హైడ్రాకు అభినందనలు చెప్పారు స్థానికులు.
