నేను ఫైటర్ను.. ధైర్యంగా ఉన్నా..యూఎస్‌‌ జైల్లోంచి వెనెజువెలా ప్రెసిడెంట్‌‌ మెసేజ్‌‌

నేను ఫైటర్ను.. ధైర్యంగా ఉన్నా..యూఎస్‌‌ జైల్లోంచి వెనెజువెలా ప్రెసిడెంట్‌‌ మెసేజ్‌‌
  • విచారపడొద్దంటూ తన కొడుక్కు నికోలస్‌‌ మదురో సందేశం

కరాకస్‌‌: ‘‘నేను పోరాట యోధుడిని, ధైర్యంగా ఉన్నా”అంటూ వెనెజువెలా ప్రెసిడెంట్‌‌ నికోలస్‌‌ మదురో తన కొడుకు నికోలస్ మదురో గుయెర్రాకు మెసేజ్‌‌ పంపారు. ప్రస్తుతం అమెరికాలోని జైల్లో ఉన్న ఆయన తనను కలిసేందుకు వచ్చిన లాయర్ల ద్వారా ఈ మెసేజ్‌‌ను కొడుక్కు పంపించారు. ఎదుటివాళ్లు ఎంత శక్తివంతులైనా అధైర్యపడొద్దని సూచించారు. తాను క్షేమంగా, ధైర్యంగా ఉన్నానని తెలియజేశారు. తన గురించి విచారంతో ఉండొద్దని సూచించారు. 

అయితే, ఈ విషయాలన్నీ లాయర్లు తనతో చెప్పినట్లు మదురో గుయెర్రా ఆదివారం మీడియాకు వెల్లడించారు. మనమంతా బలంగా ఉన్నామని, విచారంగా ఉండొద్దని వెనెజువెలా యునైటెడ్‌‌ సోషలిస్ట్‌‌ పార్టీ నాయకులకు ఆయన సూచించారు. అలుపెరుగని పోరాటవీరుడైన తన తండ్రి యూఎస్‌‌ నిర్బంధంలోనూ ధైర్యంగా ఉన్నారని, ఇక్కడ మనమంతా ఐక్యంగా ఉండి పోరాడాలని గుయెర్రా పిలుపునిచ్చారు.